స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో జనగణన పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులు స్వీయ నమోదు వివరాలు, ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జనగణనలో పాల్గొనాలని స్వీయ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎటువంటి అపోహలకు గురికాకుండా ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో తమ వివరాలను పొందుపరచాలన్నారు. అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు...