నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ స్థాయిలో జాతీయ ప్రతిభా అన్వేషణ దరఖాస్తులు స్వీకరిస్తున్నదని నిజామాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ప్రతిభా అన్వేషణ పోస్టర్లను లీగల్ సెల్ జిల్లా బైర గణేష్, సభ్యులు అన్వేష్, రోహన్, వేణు, దిలీప్ లతో కలిసి ఆవిష్కరించారు. నైపుణ్యం, ప్రతిభ, వాక్చాతుర్యం ఉన్న యువత దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దేశ ప్రగతికి, నూతనతరం నాయకత్వం తయారు కావడానికి యువత మేధాసంపత్తి అవసరమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాను బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు.
