27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రామారెడ్డిలో అకాల వర్షం

Must read

📰 Generate e-Paper Clip

. . . అన్నదాతల ఆగమాగం
. . . తడిసిన ధాన్యం

రామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో మంగళవారం చెడగొట్టు వానా అతల కుతలం చేసింది. జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది . పంటలను కోసి కల్లాల్లో ఆర బెట్టిన ధాన్యం తడిసిపోయింది. రైతు వేదికలు లేక ఉన్న అవి ఎటు సరిపోక రోడ్ల మీద, ఆరు బయట ఆరబెట్టిన వడ్లు ఆకాల వర్షంకు తడిసి పోయాయి. దానితో రైతులకు సరిపడా టార్పలిన్ లు లేక వారి పరిస్థితి దయానీయంగా మారింది. వడ్లలో తేమ శాతం పోవాలని ఎండకు అరబెడితే వర్షం వచ్చి ధాన్యం మొత్తం తడిసిపోయిందని రైతులు అవేధన వ్యక్తం చేశారు. వడ్లను ఎప్పటికప్పుడు కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Untimely rain in Rama Reddy

More articles

Latest article