వెబ్ డెస్క్, బతుకమ్మ : ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నడిపారు. యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతి అంటూ ఎక్స్ వేదికగా ఫొటోలను ఆయన పంచుకున్నారు.’ హెచ్ జేటీ-36 ‘యశస్’ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందన్నారు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని‘ రామ్మోహన్ నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

