Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 3:35 pm Posted by : ramakrishna

యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

వెబ్ డెస్క్, బతుకమ్మ : ఏరో ఇండియా-2025లో భాగంగా యుద్ధ విమానాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నడిపారు. యుద్ధ విమానాన్ని నడపడం మరిచిపోలేని అనుభూతి అంటూ ఎక్స్ వేదికగా ఫొటోలను ఆయన పంచుకున్నారు.’ హెచ్ జేటీ-36 ‘యశస్’ అనే అద్భుతమైన జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించిందన్నారు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉందని‘  రామ్మోహన్ నాయుడు ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

Union Minister Rammohan Naidu piloted the fighter jet
Union Minister Rammohan Naidu piloted the fighter jet