28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి రైల్వే పోలీసుల పరిధిలోని అశోక్‌నగర్ రైల్వే గేట్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, రాత్రి 45 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కిలోమీటర్ నంబర్ 510/12–13 వద్ద రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు కింద పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు దర్యాప్తులో తేలనున్నాయి. మృతుడు సుమారు 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు కలిగి ఉన్నాడు. ఆయన గోధుమరంగు షర్టు, బూడిద (గ్రే) రంగు ప్యాంటు, మెరూన్ రంగు డ్రాయర్ ధరించి ఉన్నారు. కుడి చేతిపై హనుమంతుని బొమ్మతో కూడిన పచ్చబొట్టు ఉంది. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర ఆధారాలు లభించలేదు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు లేదా ఆయనను గుర్తించగలిగిన వారు వెంటనే కామారెడ్డి రైల్వే పోలీసులను 87126 58614 లేదా 99513 29365 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

 

Unidentified body found

More articles

Latest article