26.3 C
Hyderabad

వస్తు సేవల నాణ్యత ప్రమాణాలపైఅవగాహన 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ వస్తు, సేవల నాణ్యతా ప్రమాణాలు ఉత్సవాలు అక్టోబర్ 7వ తేది నుండి 14 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో సోమవారం ప్రారంభ కార్యక్రమం జిల్లా కేంద్రం లో రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరైయ్యరు. ఈ సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుడు నిత్య జీవితంలో కొనుగోలు చేసే వస్తువులు, సరుకులు వాటి సేవలకు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు పూర్తి రక్షణ గా ఉంటాయని, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వినియోగదారుల రక్షణ కార్యక్రమాలలో ప్రధాన పాత్ర వహిస్తున్నదని తెలిపారు. వస్తు, సేవల నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన పూర్తి వివరాలు, వినియోగదారుల హక్కులు ప్రాధాన్యత వివరాలు గల పోస్టర్ ను నిజామాబాద్ అడిషనల్ మునిసిపల్ కమిషనర్ యన్. శంకర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వస్తువుల నాణ్యతే కాకుండా, కార్పొరేషన్ సేవలు, ఆహార పదార్థాల నాణ్యత పరిరక్షణ లో కార్పొరేషన్ ముఖ్య పాత్ర వహిస్తున్నదని తెలిపారు.

More articles

Latest article