నిజామాబాద్ క్రైం,బతుకమ్మ : నాందేడ్ నుంచి విశాఖకు తరలుతున్న నల్లబెల్లాన్ని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్ల తనిఖీల్లో భాగంగా సుమారు 2000 కిలోల నల్ల బెల్లం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. నాందేడ్ నుంచి విశాఖ వెళుతున్న రైల్లో నల్లబెల్లం తో పాటు 200 కిలోల స్పటికను కూడా గుర్తించామని తెలిపారు. నల్ల బెల్లం,స్పటికను సారా తయారీలో వినియోగిస్తారని ఎస్ఐ తెలిపారు స్వాధీనం చేసుకున్న నల్ల బెల్లం స్పటికను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
