నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాకు చెందిన ఇద్దరు టీచర్లు నేషనల్ శిక్ష రత్న అవార్డుకి ఎంపికయ్యారు. ధర్పల్లి మండలం రేకులపల్లి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంకం నరేష్, మెండోరా మండలం బుస్సాపూర్ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం డి.రాజారాంలు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషనల్ 2024- 2025 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 30 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం. విద్య బోధనతో పాటు వివిధ పరికరాల తయారీ విద్య బోధనలో నూతన పద్ధతులు అవలంబించడం వంటి అంశాలలో వీరు చేపట్టిన విద్యను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
