బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా విద్యాధికారి అశోక్ కు శుభాకాంక్షలు తెలియజేసి, కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న కేజీబీవీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు హేమలత, టియుసిఐ జిల్లా నాయకులు టి.విటల్, డి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
