హైదరాబాద్, బతుకమ్మ : కారు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని లాలాపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకులు కీసర నుంచి తార్నాకకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
