Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 December 2025, 1:20 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

హైదరాబాద్, బతుకమ్మ : కారు డివైడర్ ను  ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని లాలాపేటలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకులు కీసర నుంచి తార్నాకకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.