ఇద్దరు నకిలీ డాక్టర్లు అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విజిలెన్స్ అధికారులు నగరంలోని పలు హాస్పిటళ్లను శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఖలీల్ వాడీలో గల లయన్స్ కంటి ఆసుపత్రిపై విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దొడ్డి ముంగట్లి అనే ఆప్తమాలజిస్ట్ డాక్టర్ పట్టాలేకుండానే ఆసుపత్రిలో రోగులకు వైద్యాన్ని అందస్తున్నాడు. రోగులకు ఇంజక్షన్స్, ఐవీ ఫ్రూట్స్ ఎక్కిస్తున్నట్లు...