25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రెండు రోజులు.. రూ.20 కోట్లు

Must read

📰 Generate e-Paper Clip

. 40వేల కేస్ ల బీర్లు.. 20వేల కేస్ ల విస్కీ తాగేసిన మందుబాబులు

. ఉమ్మడి జిల్లాలో 151 వైన్స్ లు, 21 బార్ లు

. ఎక్కడ చూసినా దసరా జోష్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: లిక్కర్ వ్యాపారులు.. మందుబాబుల్లో దసరా జోష్ నింపింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.20 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. కేస్ లకు కేస్ ల మందును సరఫరా చేసి అటు ఐఎంఎల్ డిపో నిర్వాహకులు, వైన్ షాపుల నిర్వాహకులు  అలసిపోయారు. శని, ఆదివారాల్లో 40వేల కేస్ ల బీర్లు, 20వేల కేస్ ల విస్కీని మందుబాబులు తాగేశారు. గత సంవత్సరం దసరా పండగకి రూ.18 కోట్ల మద్యం వ్యాపారం కాగా, ఈ ఏడాది రూ.2కోట్లు పెరిగి రూ.20కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 151 వైన్ షాపులు, 21 బార్ లు ఉండగా, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ లోని ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపో నుంచి మద్యం సరఫరా అవుతోంది.  దసరా జోష్ కు తోడు, ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీర్లు అధికంగా అమ్ముడుపోయాయని వ్యాపారులు అంటున్నారు. దసరా శనివారం రావటంతో కొంత టెన్షన్ పడ్డామని, అయితే మరుసటి రోజు ఆదివారం కలిసోచ్చిందంటున్నారు మద్యం వ్యాపారులు. నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మకాలు మండకొడిగా సాగాయని, అయితే దసరా పండగ వీకెండ్స్ లో రావటంతో కొంత కోలుకున్నామని అంటున్నారు. మరోపక్క జిల్లా వ్యాప్తంగా రూ.4కోట్ల విలువ చేసే మేకలు అమ్ముడుపోయాయి. మొత్తం మీద ఈ సారి దసరా పండగ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో మద్యం, మాంసం వ్యాపారం జోరుగా సాగింది.

More articles

Latest article