27.2 C
Hyderabad

ఇద్దరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పదోన్నతుల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పదోన్నతి పొందిన సిబ్బంది సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

Two constables promoted to Head Constable.

 

కొంతకాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించడంతో పోలీసు శాఖలో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి లభించిన జి.లింగం, బి. శివకుమార్ గౌడ్ లకు విధి నిర్వహణలో మరింత నిబద్ధతతో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

 

Two constables promoted to Head Constable.

More articles

Latest article