నీరులేని బావిలో పడ్డ ఇద్దరు చిన్నారులు

0 15,413
  • గంటల తరబడి శ్రమించి బయటకు తీసిన అధికారులు
  • చిన్నారుల పరిస్థతి విషమం

 

బాన్సువాడ, బతుకమ్మ : తల్లిదండ్రులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు 30 ఫీట్ల లోతు కలిగిన నీరులేని బావిలో పడిన ఘటన వెలుగులోకొచ్చింది. గంటల తరబడి శ్రమించి వేలికి తీయగా ఇరువురి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో  మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలని లో పెను ప్రమాదం తప్పింది. నీరు లేని రింగుల బావిలో  ఏడేళ్ల వయసు కలిగిన రాహేల , ఆరేళ్ల ఇర్ఫాన్  పడ్డారు.  వారికి తీవ్ర గాయాలు కాగా బాన్సువాడ ఏరియా ఆస్పత్రి లో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గతంలో కుళాయిలు లేని సమయంలో బావులు తవ్వి రింగులు వేశారు. ఇప్పుడు కుళాయిలు రావడంతో బావి పై సిమెంట్ మూతలు పెట్టారు. ఇద్దరు చిన్నారులు మూత పై ఆడుకుంటుండగా మూత పగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు డాక్టర్ శ్రీను నాయక్ ఏరియా ఆస్పత్రి కి తరలించారు. పూర్తిగా తల్లిదండ్రుల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాపాయం నుంచి ఎట్టకేలకు బయటపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.