25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో పసుపు బోర్డు కార్యాలయం

Must read

📰 Generate e-Paper Clip

  • రెండు నెలలుగా ప్రభుత్వం వద్దనే కేటాయింపు దస్త్రం
  • అనుమతి కోసం బోర్డు అధికారుల ఎదురు చూపులు
  • ఖాళీగా ఉన్న కార్యాలయం బోర్డుకు కేటాయిస్తే రైతులకు ప్రయోజనం

 

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కాగా దానికి పూర్తి స్థాయి కార్యాలయం కోసం కసరత్తు జరుగుతోంది.  తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు హమీ ఇచ్చిన ఎంపి ధర్మపురి అర్వింద్ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడి చేత హమీని నెరవేర్చారు.  తెలంగాణలో అత్యధికంగా పసుపు పండించే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు పై ప్రకటన రావడమే తరువాయి జిల్లాకు చెందిన పసుపు రైతు పల్లె గంగారెడ్డిని చైర్మెన్ గా నియమించి జనవరి 13న లాంఛనంగా నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. పసుపు బోర్డు కార్యకలాపాలను  పెంచేందుకుగాను పసుపు బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానిశ్రీ  ను నియమించిన ప్రభుత్వం పసుపు బోర్డు కార్యాలయం ను శాశ్వతంగా ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా అప్పటి వరకు తాత్కాలికంగా హైద్రాబాద్ రోడ్డులో ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే వాస్తు సరిగ్గాలేదని క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడక సొంతంగానే కార్యాలయం ఏర్పాటు చేసుకున్న విషయం విధితమే. కొత్త కార్యాలయం నిర్మాణానికి అనుమతులు దరాఖాస్తు చేసిన నేపథ్యంలో పసుపు బోర్డు అధికారులు రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని తమకు కేటాయించాలని కోరారు. ఎంపి ధర్మపురి అర్వింద్ చొరవతో సంబందిత ఫైల్ ప్రభుత్వానికి చేరిందని సమాచారం. అద్దె ప్రాతిపాదికన కేటాయిస్తే తమ కార్యాలయం కార్యకలాపాలు పెరిగి పసుపు రైతులకు మరింత అందుబాటులో ఉంటామని అధికారులు యోచిస్తున్నారు. రెండు నెలలుగా సంబంధిత దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉండగా రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించాలని ఎంపి ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు ఛైర్మన్ ద్వారా ప్రభుత్వంపై  ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే కేటాయింపు వ్యవహరం పై క్లారిటీ వస్తుందని పసుపు బోర్డు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా పసుపు బోర్డు చైర్మన్, అధికారులు రేపు జిల్లాకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల దృష్టికి ఇట్టి విషయాన్ని మరోమారు  తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

Turmeric Board office in Nizamabad Rural MLA office

More articles

Latest article