29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రెడ్ క్రాస్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్రంలోని శుఖిభవ హాస్పిటల్‌లో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి యువత స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేశారు. ఇప్పటికే పలువురు యువకులు రక్తదానం చేయగా, శిబిరం సాయంత్రం వరకు కొనసాగనున్నందున  ప్రజలు ముందుకు వచ్చి పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.  ప్రాణాలను కాపాడే ఈ సేవలో యువత విశేషంగా పాల్గొనడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న షేక్ రియాజ్‌ను సమాజ సేవకులు సిలిండర్ లింగం, కాంగ్రెస్ నాయకుడు మన్నే సాగర్ తదితరులు అభినందించారు.

More articles

Latest article