23.7 C
Hyderabad

నింబాచలం పై తులసి వివాహం

Must read

📰 Generate e-Paper Clip

  • ఘనంగా గిరి ప్రధక్షిణ
  • హరినామ స్మరణతో పులకించిన లింబ్రాద్రి గుట్ట

భీమ్‌గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కొండపై తులసి వివాహం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు స్వామి యోగ నిద్ర నుండి మేల్కొనిన పర్వదినం పురస్కరించుకొని విష్ణు, ప్రభోదోత్సవం తో పాటు శ్రీ తులసి వివాహం జరిపారు. మొదట తులసి, విష్ణువు కు ఆసనాది మంత్ర పుష్పాంతము వరకు షోడశోపచార పూజ నొసంగి, వాధ్య ఘోషములచే స్వామి ని మేల్కొలిపారు. స్వామి ని ప్రార్తించి పుష్పాంజలి సమర్పించారు. తదుపరి శాస్త్ర విధిగా తులసీ, విష్ణువు ల వివాహంను నిర్వహించారు.అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీ లక్మీ నరసింహుని ఆయుధం అయిన శ్రీ చక్ర స్వాముల వారిని గిరి ప్రదక్షిణ గావించారు. శ్రీ వారి ఉత్సవ యాగ సంరక్షణమునకుగాను శ్రీ చక్ర స్వాముల వారిచే నింబాద్రి కొండ ప్రదక్షిణను గావించారు.

Tulsi marriage on Nimbachalam

ముందుగా ఆలయ అర్చకులు శ్రీ చక్ర స్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకృతులను చేసి మేళతాళాలు, భాజ భజంత్రిలు, మంగళ హరతులు వెంటరాగ భగవంతునినామ సంకీర్తనలతో భక్త జనులు గోవింద నామస్మరణ తో వెంట నడువగా కొండ ప్రదక్షిణ గావించారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేయగా క్షేత్రం అడవులు, కొండలు పులకించిపోయాయి. నవాహ్నిక క్రియా రూపమున ప్రకాశించే ఇట్టి మహోత్సవము నందు సాక్షాత్తు శ్రీ లక్మీ నృసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండపై జరిగిన శ్రీ చక్ర స్వాముల గిరి ప్రదక్షిణము చేయుటకు వచ్చిన భక్తుల జీవితం ధన్యం అవుతుందని ప్రతితి.గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల మనోబిష్టము లను ఆ లక్మీ నృసింహుడు నేర వేర్చి ఆయురారోగ్యాలు, సంపాదన చేకూర్చుతాడని భక్తుల నమ్మకం. నింబాచల గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షం తో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

Tulsi marriage on Nimbachalam

More articles

Latest article