నింబాచలం పై తులసి వివాహం
ఘనంగా గిరి ప్రధక్షిణ హరినామ స్మరణతో పులకించిన లింబ్రాద్రి గుట్ట భీమ్‌గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం కొండపై తులసి వివాహం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు స్వామి యోగ నిద్ర నుండి మేల్కొనిన పర్వదినం పురస్కరించుకొని విష్ణు, ప్రభోదోత్సవం తో పాటు శ్రీ తులసి వివాహం జరిపారు. మొదట తులసి, విష్ణువు కు ఆసనాది మంత్ర పుష్పాంతము వరకు షోడశోపచార పూజ నొసంగి, వాధ్య ఘోషములచే స్వామి ని మేల్కొలిపారు. స్వామి ని...