25.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్మూర్ పట్టణానికి టీయూఎఫ్ఐడీసీ నిధులు తిరిగి మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి

ఆర్మూర్, బతుకమ్మ :  పట్టణానికి గతంలో రద్దయిన టీయూఎఫ్ఐడీసీ నిధులను తిరిగి మంజూరు చేయించినట్లు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి  ఒక ప్రకటనలో తెలిపారు. ఈనిధుల విషయమై జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి కోరానని పేర్కొన్నారు. పట్టణ అభివద్ధి కోసం రూ.32.57, రూ.14.25 కోట్లు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి రూ. 4 కోట్లు, మొత్తం రూ. 50 కోట్ల 82 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి  జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లకు వినయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

TUFIDC funds re-granted to Armoor town

More articles

Latest article