బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోనితెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ సోషల్ వర్క్ విద్యార్థులు సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నిజామాబాద్ లోనీ వర్డ్ స్వచ్ఛంద సంస్థను సందర్శించారు. స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ సంస్థ చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. ముఖ్యంగా హెచ్ఐవి /ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు, బాధిత కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ విధానాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థుల సందేహాలను వారు నివృత్తి చేసారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. యాలాద్రి, విద్యార్థిని విద్యార్థులు, మరియు స్వచ్ఛంద సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు.

