27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామంలో సోమవారం మున్నూరు కాపు సంఘ సభ్యులు సోమవారం మాజీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ ను ఘనంగా సన్మానించారు. సిర్నాపల్లి మున్నూరు కాపు పటేల్స్ ఆత్మ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా ఆకుల లలిత రాఘవేందర్ హాజరయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘాల సభ్యులు ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు తన వంతు కృషి చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శీలం జానకి బాయ్ సిర్నపల్లి గ్రామానికి కృషి చేసిందని అన్నారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నుండి బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగిందని అన్నారు. ఉమ్మడి ఇందల్వాయి మండలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు నిర్వహించడం జరిగిందని సిర్లపల్లి గ్రామంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళను చాలా వరకు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి గంగాధర్, మాజీ ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు, ఇందల్వాయి మండలం మున్నూరుకాపు సంఘ సభ్యులు, మాజీ ఎంపీటీసీ,మండల వాసులు అరిపెల్లి దశరథ్,గట్టు కడారి, బైరయ్య ,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article