బోధన్‌లో గిరిజన విద్యార్థి సంఘం నిరసన

0 14,771

బతుకమ్మ, బోధన్:  బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెల్లం వెంకట్రావు, సోయం బాబు రావుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. లంబాడాలను ST జాబితా నుండి తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్, బోధన్ మండల అధ్యక్షుడు విశ్వనాథ్ నాయక్, కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, ఎడపల్లి మండల అధ్యక్షుడు గంగాధర్ నాయక్, కార్యదర్శి పాతలోత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు అశోక్ నాయక్, రవి నాయక్, హరీష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.