ఒకే గుర్తింపు.. రెండు పాఠశాలలు..

0 15,442

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒకే పాఠశాల గుర్తింపుతో కరుణ్య పాఠశాల, ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ పాఠశాలలు నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంఈఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ ఒకే పాఠశాలను రెండు పేర్లతో నడిపి మోసం చేస్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ పాఠశాల పేరుతో ఎలాంటి అనుమతి లేకపోవడంతో, ఆ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసినందుకు కారుణ్య యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.