27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అగ్ని ప్రమాదంలో ఈత చెట్లు దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

  • సుమారు 40 చెట్లు అగ్నికి ఆహుతి…

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారులో నాలుగు కుటుంబాలకు సంబంధించిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్బంగా బాధిత గౌడ కులస్తులు మాట్లాడుతూ. పక్కనే ఉన్న పొలం చేసే కౌలు రైతు పొలానికి అగ్గిపెట్టడంతో ఈత చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 40 చెట్లు  పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని అన్నారు. ఈత చెట్లపై జీవనం సాగించే మా నాలుగు కుటుంబాలకు చెందిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిద అయ్యాయని, ఈత చెట్లే మా జీవన ఆధారమని,  మా పొట్ట కొట్టారని, ఇప్పుడు మా పరిస్థితి ఏమిటని, ఎలా జీవనం సాగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈత చెట్లను నరికి వేస్తూ, చెట్లకు ఉన్న కుండలను పగలగొట్టారన్నారు. ఈత చెట్లకు అగ్గి పెట్టిన కౌలు రైతు పై చట్ట రిత్యా చర్యలు తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని వారు కోరారు.

Trees burnt in fire accident

More articles

Latest article