. . .ట్రాన్స్ జెండర్స్ కి మున్సిపల్ కోఆప్షన్ లుగా, రాజకీయ ప్రాధాన్యత కల్పించడం ప్రజాపాలనకు నిదర్శనం
. . .కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ట్రాన్స్ జెండర్లకు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా, రాజకీయ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ ట్రాన్స్ జెండర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి గంగ, ప్రధాన కార్యదర్శి జరీనా బేగం, కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివక్షత లేని ప్రజా పాలన కొనసాగిస్తున్నారనడానికి ట్రాన్స్ జెండర్స్ కి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని చేసిన నిర్ణయమే నిదర్శనమన్నారు, మహిళలతో సమానంగా ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని, రేషన్ కార్డులు అందించడం, ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత ఇవ్వడం లాంటి సంక్షేమ పథకాలే కాకుండా, సమాజంలో చట్టసభల్లో అవకాశం కల్పించే విధంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వడం ఆయన చిత్తశుద్ధికి ప్రజాపాలనకి నిదర్శనం అన్నారు. కన్న పేగు బంధం మమ్మల్ని దూరం పెట్టిన, సమాజం లో చిన్న చూపుతో జీవిస్తున్న మాకు పెద్ద దిక్కై , కన్న తండ్రిగా, తోడబుట్టిన అన్న గా రేవంత్ రెడ్డి అండగా నిలవడం మరిచిపోలేని విషయమన్నారు, ట్రాఫిక్ సిగ్నల్ ల దగ్గర భిక్షాటన చేస్తున్న మమ్మల్ని, అదే ట్రాఫిక్ సిగ్నల్ ల దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ గా అవకాశం ఇచ్చి మా ఆత్మగౌరవానికి దిక్చూచి అయ్యారన్నారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు రేవంత్ రెడ్డి అని ఆయనకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్స్ నాయకులు శ్యామల, లైలా, అమల, అనేకమంది ట్రాన్స్ జెండర్స్ లు పాల్గొన్నారు.