28.8 C
Hyderabad
Monday, August 3, 2026

జూనియర్ అసిస్టెంట్ లకు  సర్వీస్ నిబంధనలపై శిక్షణ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పంచాయతీ రాజ్ విభాగంలో ఇటివల నూతనంగా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్లకు సర్వీస్ నిబంధనలపై శిక్షణా కార్యక్రమం  ప్రారంభమైంది. ఈ నెల 18 వరకు డిఆర్ సి భవనంలో జరిగే శిక్షణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ సాయి గౌడ్, డిప్యూటి సిఇఓ సాయన్నలు ప్రాంభించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతు…. పంచాయతి రాజ్ చట్టాలతో పాటు క్షేత్రస్థాయి అధ్యయనం పరిశీలన ద్వార పాలన సాధ్యమన్నారు. ఇది వరకు పనిచేసిన అనుభవజ్ణుల సలహలు సూచనలు తీసుకోవాలని కోరారు. జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం వినతి మేరకు నూతనంగా నియమించబడిన జూనియర్ అసిస్టెంట్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం భాస్కర్ ,అసోసియేట్ ప్రెసిడెంట్ శంకర్ రాజు లు అధికారులను సన్మానించి సత్కారించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సిద్దు పటేల్, సునీత దేవి కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు , లింగన్న తో పాటు సిబ్బంది శిక్షణలో కొత్తగా అపార్ట్మెంట్ అయిన వాళ్ళందరూ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More articles

Latest article