24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తాగునీటి సహాయకులకు ప్లంబింగ్ లో శిక్షణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి:  తాగునీటి సహాయకులకు రెండో రోజు ప్లంబింగ్ లో శనివారం శిక్షణ ఇచ్చారు. మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే శిక్షణ లో బాగంగా రెండో రోజు శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు క్లోరినేషన్ లో శిక్షణ ఇవ్వగా రెండో రోజు పైప్ లైన్లు మరమ్మతులు, కొత్త నల్లాలు బిగించడం లో మెలుకువలను ప్రయోగాత్మకంగా వివరించారు. గ్రామీణ తాగునీటి సరఫరా లో తలెత్తే సమస్యలను స్వయంగా వాటర్ మెన్ లు పరిష్కరించుకునే విధంగా శిక్షణ కొనసాగింది. ఇంట్రా ఏఈఈ వంశీ శిక్షణ అందిస్తున్నారు.

More articles

Latest article