- హరీష్‌దే కుట్ర..
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైద్రబాద్, బతుకమ్మ : హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. రేపు కేసీఆర్, కేటీఆర్ లను కూడా తన లాగే పార్టీ నుంచి బయటకు పంపుతారని.. పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటారని కవిత జోస్యం చెప్పారు.
కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కాం చేశారని.. ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకూ ఫండింగ్ చేశారని అన్నారు. కేటీఆర్ ను ఓడించడానికి హరీష్ రావు సిరిసిల్లకు అరవై లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్‌లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ కు హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని.. హాస్టళ్లకు హరీష్ రావు డెయిరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతూంటే.. ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ వెంట.. హరీష్ మొదటి నుంచి లేరన్నారు. టీడీపీకి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు ..వైఎస్ ను కూడా కలిశారన్నారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని డబుల్ షూటర్ అని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు హాని కలిగించే పనులు తాను చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్, సంతోష్‌లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డపేరు వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్ట్ ను కొట్టేయాలని కుట్ర చేశారన్నారు.
- మొత్తం అతనే నాన్నా..
- హరీశ్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు..
హరీశ్ రావు, సంతోష్ రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని కవిత అన్నారు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ కవిత వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే అంటూ కవిత ఆరోపించారు.
కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. హరీష్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు.. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్‌కు అన్యాయం జరగనివ్వను. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా ఎన్నో జన్మల పుణ్యముంటే కేసీఆర్‌కు కూతురిగా పుట్టా. కేసీఆర్‌ను పార్టీని నేనెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటా.. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నేను ఒకేలా ఉన్నా. అధికారంలో ఉన్నా.. నన్ను ప్రతిపక్ష ఎంపీగానే చూశారు. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచింది.. అంటూ కవిత తన ప్రెస్ మీట్ లో ఆద్యంతం హరీశ్ రావుని టార్గెట్ చేశారు..
- సంతోష్ రావు ధన దాహానికి అడ్డు అదుపు లేదు..
- నేరేళ్ల లో టార్చర్ చేసింది సంతోష్.. చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు..
- హరీష్ , సంతోష్ లు ఇద్దరు మేక వన్నె పులులు..
తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మీద కూడా కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సంతోష్ రావు దన దాహానికి అడ్డుఅదుపు లేదు. సిరిసిల్లలోని నేరేళ్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్.. చెడ్డ పేరు మాత్రం కేటీఆర్ కు ఇచ్చారు. ముందులో మంచింగ్ చేయడానికి ఒకడు ఉండాలి వీడు వాడే అంటూ కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు. ఇది నాకు చెప్పింది పల్లా రాజేశ్వర్ రెడ్డి. 750 కోట్ల విల్లా ఎక్కడిదితనికి నవీన్ రావు ఎమ్మెల్సీకి పదవి ఎలా వచ్చింది. సంతోష్ వాళ్ళ హరీష్ రావు సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ లతో కుమ్మక్కు అయి బిఆర్ఎస్ ఓడిపోయేలా చేశారు. చివరకు కెసిఆర్ కామారెడ్డిలో ఓడిపోయేలా చేశారు. హరీష్ రావు మీడియాను మేనేజ్ చేస్తే.. రాం అన్న యూట్యూబ్ ను మేనేజ్ చేస్తారు. రాం అన్నకు చెప్తున్న.. నువ్వు కూడా హరీష్ రావు లాగా నేర్చుకో. కూతురిగా చెప్తున్న వీళ్ళను పార్టీలో ఉంచుకుంటే వీళ్లు మిమ్మల్ని కూడా మింగేస్తారు. వీరు ఇద్దరు మేక వన్నె పులులు..అంటూ కవిత కేసీఆర్ మేనల్లుళ్లు అయిన హరీశ్ రావు, సంతోష్ రావు లపై ధ్వజమెత్తారు..
- కవిత శాపనార్థాలు
బీఆర్ఎస్ పార్టీ తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కల్వకుంట్ల కవిత కలికాలం కర్మ సిద్ధాంతమంటూ వేదాంతంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తాను దాదాపు 20 ఏళ్ల పాటు సేవా చేశానని ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులే పార్టీ కోసం పని చేశారా.. తాను పని చేయాలేదా.. అంటూ బీఆర్ఎస్ అగ్రనేతను ఆమె సూటిగా ప్రశ్నించారు. అయితే తనపై పుకార్లు చేసిన వారు.. చేయించిన వారు అంతకుఅంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు. తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు మాత్రం అన్యాయం జరగనివ్వనని ఆమె కుండ బద్దలు కొట్టారు. తనపై ఇన్ని కుట్రలు ఇన్ని అవమానాలు అవసరమా అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా అడిగారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కేసీఆర్‌కు తాను కుమార్తెగా జన్మించానని చెప్పారు. అలాంటి కేసీఆర్‌ను ఆయన పార్టీని తాను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌పై ఒత్తిడి పెంచి తద్వారా తనను సస్పెండ్ చేయించారంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
