- దేశ సమగ్రతపై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు
- నవంబర్ 20-22 తేదీల్లో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు
- ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఏ సమాజానికైనా అవసరమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ, నైతిక, వైజ్ఞానిక, మానవీయ విలువలు ఇచ్చే సాధన విద్యాని, ఆ విద్యనే నేటి పాలకులు భ్రష్టుపట్టుస్తున్నారని, సమస్యల సుడిగుండంలో, సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో పాలక వర్గాలున్నాయని, దేశ సమగ్రతపై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 20-22 తేదీల్లో ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత ఇందూరు హోటల్ లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బానోతు రఘురాం అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్ ఎ స్టాలిన్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తూ భ్రష్టుపట్టుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్రలను అమలు చేస్తున్నారని దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్యా కార్పొరేటికరణ, విద్యాకేంద్రీకరణ, కాషాయికరణ చేయాలని చూస్తుందని, విద్యారంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని, పాలకులు ప్రపంచ బ్యాంక్ సలహాలపై ఆధారపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం’ అనే పద్ధతిలో విద్యావ్యాపారానికి పచ్చ జెండా ఊపయాని అన్నారు. రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరిస్తూ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాలలలో అమలు కానీ మధ్యాహ్న భోజన పథకమని, సమస్యల సుడిగుండంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే వివిధ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల కాక పోవడంతో కళాశాల నుండి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తద్వారా వారు చదువులు ముందుకు సాగడం లేదన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియాంబర్స్ మెంట్ 8,300 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర 4వ రాష్ట్ర మహాసభలు వేదిక కానున్నాయని, ఈ మహాసభలు నవంబర్ 20-22 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం సంతోషకరమని, మహాసభల విజయవంతం కోసం ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని అన్నారు. ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని, దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా దేశ స్వాతంత్ర్యం మా జన్మహక్కు అని 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆవిర్భావించి 90 సంవత్సరాలుగా దేశ సమగ్రతపై, ప్రభుత్వ విద్య పరిరక్షణకై, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ అని, అలాంటి ఎఐఎస్ఎఫ్ పనిచేస్తుందుకు గర్వపడాలని అన్నారు.
అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ లు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరమైన భావి భారత పౌరుల చదువుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదని, రాజకీయ లబ్ధి కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న పాలకులు ప్రభుత్వ విద్యను పక్కకు పెడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో సంక్షేమ హాస్టల్లో గురుకులాల్లో మౌలిక వసతులు ఉండటం లేదని, బోధన, బోధనేతర సిబ్బంది లేక ప్రభుత్వ చదువులు ప్రశ్నార్ధకంగా మారాయని అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియాంబర్స్ మెంట్ 8,300 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, జెవివి రాష్ట అధ్యక్షులు నర్రా రామారావు, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మెన్ మారయ్య గౌడ్, కాకతీయ విద్యా సంస్థల చైర్మెన్ రజిని కాంత్, బిబిసి విద్యా సంస్థల చైర్మన్ ప్రవీణ్, ఎస్ఆర్ విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్ శ్రీకాంత్, అల్ఫోర్స్ జోనల్ ఇంచార్జ్ అనిల్, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు రాజు గౌడ్, శ్యాంబాబు, రాజశేఖర్, భాను ప్రసాద్, కిరణ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఇటికాల రామక్రష్ణ, కాసోజు నాగజ్యోతి, నాయకులు మచ్చ రమేష్, ఎస్. కైలాష్, సుబోధ్,కుషాల్
ఆహ్వాన సంఘం: మహాసభల ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా మారయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బానోతు రఘురాంలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

