ఎల్లారెడ్డి, బతుకమ్మ :
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవో కేంద్ర కమిటీ సూచనల మేరకు సాయిలు ఎన్నికల అధికారి సమక్షంలో కామారెడ్డి జిల్లా టీఎన్జీవో ఎల్లారెడ్డి యూనిట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నూతన కమిటీకి జిల్లా అధ్యక్షులు స్వాగతం పలికారు. ఉద్యోగుల సమస్యలలో టీఎన్జీవో ఎప్పుడు ముందు ఉంటుందని ఉద్యోగుల ఐక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి కోరారు. ఎల్లారెడ్డి యూనిట్ నూతన అధ్యక్షులుగా మహిపాల్, కార్యదర్శిగా వి. శ్రవణ్, కోశాధికారిగా రవీందర్, వైస్ ప్రెసిడెంట్ రాజా గౌడ్, వైస్ ప్రెసిడెంట్ జై.శ్రీకాంత్, వసంత లక్ష్మి, జాయింట్ సెక్రెటరీ సంతోష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అభినవ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ స్వాతి,ఆర్గనైజింగ్ సెక్రటరి కృష్ణ, పబ్లిక్ సెక్రెటరీ శంకరయ్య, ఈసీ మెంబర్ ప్రశాంత్ కుమార్, ఈసీ మెంబర్ శారద, శరత్ చంద్ర ప్రసాద్, రవీందర్ లు ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ మహిపాల్ మాట్లాడుతూ టీఎన్జీవోస్ సలహాలు,సూచనల ప్రకారం నడుచుకుంటానని ఉద్యోగుల సమస్యలలో తనవంతు పాత్రతో సహాయ,సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం కార్యదర్శి యం.నాగరాజు,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చక్రాధర్,జిల్లా కోశాధికారి దేవరాజు,జిల్లా ఉపాధ్యక్షులు యం.సి.పోచయ్య,జె.శ్రావణ్,దోమకొండ తాలూకా యూనిట్ అధ్యక్షులు బి.సంతోష్, అర్బన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
