నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులుగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణ ను టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బండారుపల్లి మల్లేశ్ మాదిగ, నాయకులు సున్నాల శివ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.