29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టీఎమ్మార్పీఎస్ డిచ్ పల్లి  మండల కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

డిచ్పల్లి, బతుకమ్మ : టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలు ఎన్నుకుంటున్నట్లు టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ తెలిపారు. ఈ క్రమంలోనే డిచ్పల్లి మండల కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ పల్లెల్లోకి, మాదిగ వాడలోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు జాతి ప్రజలకు అందే విధంగా ఈ కమిటీలు కృషి చేయాలని సూచించారు. డిచ్పల్లి మండలం అధ్యక్షులుగా ఆర్మూర్ నవీన్ మాదిగ, ఉపాధ్యక్షులుగా బరికుంట్ల చిన్నయ్య మాదిగ, ప్రధాన కార్యదర్శిగా దోస్గం గంగారం మాదిగ లను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు బండారిపల్లి మల్లేష్ మాదిగ, నాయకులు సుమన్ మాదిగ, నవీన్ మాదిగ, చిన్నయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article