టీఎమ్మార్పీఎస్ డిచ్ పల్లి మండల కమిటీ ఎన్నిక
డిచ్పల్లి, బతుకమ్మ : టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలు ఎన్నుకుంటున్నట్లు టీఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ తెలిపారు. ఈ క్రమంలోనే డిచ్పల్లి మండల కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ వర్గీకరణ ఫలాలు మాదిగ పల్లెల్లోకి, మాదిగ వాడలోకి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు జాతి ప్రజలకు అందే విధంగా ఈ కమిటీలు కృషి చేయాలని సూచించారు. డిచ్పల్లి మండలం...