లాండ్రీ షాప్ కు నిప్పు పెట్టిన దుండగులు

0 8,584

 

. . . రూ.35 వేల నష్టం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణంలోని అర్ఫత్ కాలనీలో ఓ లాండ్రీ షాప్ కు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో షాప్ లో ఉన్న సుమారు రూ.35 వేల నగదుతో పాటు పట్టుచీరలు, వస్త్రాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని బాధితుడు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో తాను పార్టీ మారి కౌన్సిలర్ గా పోటీ చేసినందుకే, కొందరు కక్షగట్టి ఈ దారుణానికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.