బతుకమ్మ, బోధన్ : చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులకు బోధన్ పోలీసులు కేసులు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా జైలు శిక్షలు విధించబడినట్లు బోధన్ ci వెంకటనారాయణ తెలిపారు. రాకాసిపేట్‌కు చెందిన సల్మాన్ మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. ఇదే కేసులో కోనాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఫిరోజ్‌కు ఒక రోజు జైలు శిక్ష విధించారు. అలాగే బోధన్ గోశాల వద్ద అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నేనావత్ మారుతిని పోలీసులు అదుపులోకి తీసుకొని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతలప సాయి ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి రూ.1,000 జరిమానాతో పాటు ఒక రోజు జైలు శిక్ష విధించింది. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ci వెంకటనారాయణ హెచ్చరించారు.
