27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మూడు జిల్లాలు.. ఎనిమిది గంటలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో పట్టభద్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు హెలీకాప్టర్ ద్వారా బేగంపేట నుంచి బయల్దేరనున్న సీఎం 11.45గంటలకు నిజామాబాద్ కు చేరుకుంటారు. 11.50 నుంచి 1.30గంటల వరకు భూమారెడ్డి కన్వెన్షన్ లో పట్టభద్రులతో నిర్వహించనున్నసమావేశంలో ఆయన పాల్గొంటారు. 1.35 గంటలకు నిజామాబాద్ నుంచి మంచిర్యాలకు బయల్దేరుతారు. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో మీటింగ్ ల అనంతరం 6.45గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకుంటారు.

More articles

Latest article