23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందనడానికి రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎం.డి.ఇర్ఫాన్ ఆలీ నియామకమే ఒక నిదర్శనమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇర్ఫాన్ ఆలీ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎదుగడం అభినందనీయమన్నారు. అదే విధంగా నిజామాబాద్ కు చెందిన మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడం గర్వకారణమన్నారు. జిల్లా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ను మరింత బలోపేతం చేయాలన్నారు. అనంతరం ఇర్ఫాన్ ఆలీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్ష పదవి అప్పగించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మహ్మద్ ఆలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, తాహెర్ బిన్ హందాన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నగర కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ శాలువాతో సన్మానించారు.

More articles

Latest article