24 C
Hyderabad
Sunday, August 2, 2026

పార్టీకోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లభిస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

బతుకమ్మ , బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తకు అధిష్టానం తగిన గుర్తింపు ఇస్తుందనడానికి ఉదాహరణ వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించడమేనని కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతంగానే బలోపేతం చేసేందుకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, క్షేత్రస్థాయిలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు రైతంగానే బలోపేతం చేసే విధంగా వారికి అండగా ఉండి సేవలందించాలన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ సురేష్ షత్కార్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా పాలకవర్గ సభ్యులు స్థానిక నాయకులు శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి, పోతంగల్ మండలాల అధ్యక్షులు షాహిద్,పుప్పల శంకర్, మాజీ ఎంపీపీ పవన్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలెక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వైస్ చైర్మన్ కొత్తిమీర్ కార్ లక్ష్మణ్,మార్కెట్ కమిటి చైర్మన్ హన్మంతు ,మాజీ జెడ్పిటీసీలు పుప్పాల శంకర్ ,అంబర్ సింగ్ , నార్ల రత్న కుమార్ ,రాజి రెడ్డి , మండల అధ్యక్షులు. తోట అరుణ్ కుమార్ నేమని బుజ్జి నార్ల సురేష్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ,రేంజర్ల సాయిలు, స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Those who have worked hard for the party will get due recognition

More articles

Latest article