26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన..

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దివ్యాంగుల ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. అన్ ఎంప్లాయిడ్ డిసేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ మంగళవారం నిర్వహించిన ఛలో అసెంబ్లీ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.

 

This is not a people's government.. an anti-people government..

 

ఆరు గ్యారంటీ ల అమలు ఎలాగో పూర్తి స్థాయిలో జరగడం లేదు, కనీసం వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ప్రధానంగా వారికి స్కూటీ అందజేస్తామని చెప్పి విస్మరించారన్నారు. స్వయం ఉపాధి కింద ఇస్తున్న రూ.50 వేల ఋణం ఏమాత్రం సరిపోవడం లేదని, దీన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముందు పోలీసులు అడ్డుకోవడం తో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, రామారావు పటేల్ తో కలిసి గన్ పార్క్ అమరవీరుల పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

This is not a people's government.. an anti-people government..

More articles

Latest article