ఇది ఉద్యోగులందరి ఐక్యతకు దక్కిన నిదర్శనం

0 8,617

 

. . . టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఉద్యోగులు ఎదుర్కున్న ఇబ్బందులకు ఉపశమనం కలుగుతుందని, ఇది ఉద్యోగులందరి ఐక్యతకు దక్కిన విజయమని టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స కొరకు ఆరోగ్య కార్డులు (ఈహెచ్ఎస్) మంజూరు చేయడం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చడం, 60 సంవత్సరాల లోబడి ఉన్న ఉద్యోగులందరికీ ప్రమాదంలో మరణించినట్టయితే కోటి రూపాయలు, సాధారణ మరణం పొందినట్లయితే 10 లక్షల రూపాయల జీవిత భీమాను అందించే సంస్కరణను తేవడం కోసం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వ మంత్రులతో, ఐఏఎస్ ఉప సంఘ అధికారులను సమన్వయపరచుకొని, ఒత్తిడి తెచ్చి నేడు పైన తెలిపిన అంశాలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకునేందుకు అహర్నిశలు కృషి చేసినటువంటి టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, కో చైర్మన్ ఏలూరు శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్)కి, ఇతర ముఖ్య జేఏసీ నాయకులందరికీ ఎంప్లాయిస్ జేఏసీ నిజామాబాద్ జిల్లా పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న వైద్య విధాన పరిషత్ వ్యవస్థ వల్ల ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ నాటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకరించి ఈ వ్యవస్థను తీసుకురావడం వల్ల ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే వారిని, నెలవారి జీతభత్యాలు సకాలంలో అందక, ఇతర ప్రభుత్వ సౌకర్యాలకు దూరమై అనేక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ నిరంతరం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 12,500 మంది ఉద్యోగులకు 200 ఆసుపత్రులకు గొప్ప మేలు జరిగిందని వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఈ ఉద్యోగులందరికీ నేరుగా ట్రెజరీ ద్వారా నెలసరి జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయని,  అంతేకాకుండా వైద్య విధాన పరిషత్ లో పనిచేసే స్టాఫ్ నర్స్ లకు, నర్సింగ్ ట్యూటర్లుగా పదోన్నతి పొందే అవకాశం లభిస్తుందని, ఇది ఉద్యోగులందరి ఐక్యతకు దక్కిన నిదర్శనమని వారు కొనియాడారు. ఈ సంస్కరణలు అమలు కావడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గారు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మొహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఐఏఎస్ అధికారుల కమిటీకి టీజీఈజేఏసీ నిజామాబాద్ జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నిరంతర కృషివల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతతో టీజీఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు, జిల్లాలో గల జేఏసీ నాయకులందరినీ సమన్వపరచుకొని ప్రధాన డిమాండ్లు అయిన కొత్త పీఆర్సీ సాధన, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల విడుదలను నెలకు 700 కోట్ల నుండి 1500 కోట్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగుల హక్కులను సాధించుకుంటామని, టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి టీజీఈజేఏసీ అడిషనల్ సెక్రటరీ జనరల్ పి.మోహన్ రెడ్డి, కో చైర్మన్లు ధర్మేందర్, నేతికుంట శేఖర్, నేరెళ్ల శ్రీనివాస్, ఎం.బాలయ్య, బి. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ డి.గోపాల్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.సతీష్, టీజీఈజేఏసీ కోశాధికారి జాకీర్ హుస్సేన్, జేఏసీ కార్యవర్గ సభ్యులు ఆర్. ప్రవీణ్ కుమార్, ఎండీ. జమీలుల్లా, వనమాల సుధాకర్, కేవీ.రమణాచారి, ఒమాజీ, జి.గంగాధర్, జాఫర్ హుస్సేన్, అశ్విన్ కుమార్, రాజీవ్, లక్ష్మీనారాయణ, మాణిక్యం, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, టి.వినీత తదితరులు హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.