- ప్రధాన ముద్దాయి రతన్ కుమార్ కు ఎనిమిది సెక్షన్లలో
- మరో 12 మందికి ఐదు సెక్షన్లలో
- అందరు అమర్లబండ గ్రామస్థులు…
- నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ తీర్పు
నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదశివ్ నగర్ మండలం అమర్లబండ గ్రామస్తుడైన ప్రధాన ముద్దాయి కుంట రతన్ కుమార్ కు ఎనిమిది సెక్షన్లలో కఠిన కారాగార శిక్షలు,మరో పన్నెండు మంది ముద్దాయిలకు ఐదు సెక్షన్లలో కఠిన కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి. శ్రీనివాస్ శుక్రవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి. అమర్లబండ గ్రామానికి చెందిన కొత్తూరి రాజేశ్వర్ భార్య లత 2020 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తున్నారు. 07 డిశంబర్, 2020 న గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ నిధులు ముప్పై వేలు దుర్వినియోగం చేశారని సర్పంచ్ లత పై కొందరు ఆరోపణలు చేశారు. తాను నిధులు దుర్వినియోగం చేయలేదని కావాలంటే కామారెడ్డి లోని భరత్ ట్రేడర్స్ యాజమాన్యం దగ్గరకు వెల్లి నిజానిజాలు నిగ్గు తెలుద్దామని లత, ఆమె భర్త రాజేష్వర్ గ్రామ పెద్దలను వెంటబెట్టుకుని వెళ్లారు. అక్కడ ట్రేడర్స్ వారు సర్పంచ్ పంచాయతీ నిధుల చెల్లింపులో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్దారణ అయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవికి లత ఆమె ప్రత్యర్తిగా న్యాలపురం స్వామి భార్య బాలమణి పోటీ పడ్డారు. ఎన్నికలలో లత విజయం సాధించారు. ఓడిపోయిన బాలమణి ఆమె భర్త స్వామి మనసులో కక్ష పెంచుకుని,లత ప్రత్యార్థి వర్గాలతో కలిసి లతను ఇబ్బందులకు గురి చేసేవారు.అదే గ్రామానికి చెందిన పలు నేరాలలో సంబంధం ఉన్న కుంట రతన్ కుమార్, న్యాలపురం స్వామి, న్యాలపురం మోహన్, న్యాలపురం కిరణ్, గుండెల్లి గంగారామ్, గుండెల్లి శేఖర్, గుండెల్లి లింగయ్య, చిట్యాల రజనీకాంత్, న్యాలపురం బాలమణి, గుండెల్లి గంగామణి, న్యాలపురం సైదవ్వ, న్యాలపురం శ్యామల, న్యాలపురం లక్ష్మీ లు మూకుమ్మడిగా 08 జనవరి, 2021 న రాత్రి ఎనిమిదిన్న గంటల సమయంలో కర్రలు, రాళ్లు, పైపులతో లత ఇంటికి వెల్లి కొట్టి గాయ పరిచారు. భూతుమాటలు తిడుతు, చంపి వేస్తామని బెదిరించారు. రతన్ కుమార్ కులం పేరుతో దూశించాడు. సదరు నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారు.ప్రధాన ముద్దాయి కుంట రతన్ కుమార్ కు, మిగతా ముద్దాయిలకు భారత శిక్షస్కృతి సెక్షన్స్ 448(అక్రమంగా ఇంటిలోకి వెళ్లడం ) నేరానికి ఒక సంవత్సరం కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 290(శాంతికి భంగం కలిగించడం )నేరానికి గాను రెండు వందల రూపాయల జరిమానా,సెక్షన్ 324(గాయపర్చడం ) నేరానికి గాను ఒక సంవత్సరం కఠిన జైలుశిక్ష తో పాటు వేయి రూపాయల జరిమానా,సెక్షన్ 427(ఆస్థి నష్టం కలిగించడం )నేరానికి గాను ఒక సంవత్సరం జైలుశిక్షతో పాటు వేయి రూపాయ జరిమానా, సెక్షన్ 506(నేర పూరిత బెదిరింపు) నేరానికి గాను ఒక సంవత్సరం జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. ప్రధాన ముద్దాయి రతన్ కుమార్ కు అదనంగా కులం పేరుతో దూశించినందుకుగాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అత్యాచారాల చట్టం సెక్షన్ 3(1)(r) షెడ్యూల్డ్ కులం అని తెలిసి ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపు కు గాను మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా,సెక్షన్ 3(1)(s) వస్తువులను నాశనం చేసిన నేరానికి గాను మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 3(2)(va) షెడ్యూల్డ్ కులం అని తెలిసి నేరాని పాల్పడినందున మూడు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. శిక్షలన్నీ ఏక కాలంలో అనుభవించాలని తీర్పులో జడ్జి శ్రీనివాస్ పేర్కొన్నారు.జరిమానా చెల్లించని యెడల అదనంగా ప్రతి సెక్షన్ కు ఒక నెల జైలుశిక్ష అనుభవించాలన్నారు.ముద్దాయిలందరికి మూడేళ్ళ లోపు జైలుశిక్షలు కోర్టు విధించినందున , కోర్టుకు చట్ట ప్రకారం సంక్రమించిన అధికారం మేరకు వారి న్యాయవాది దాఖలు చేసిన శిక్షలను ఒక నెలపాటు సస్పెన్షన్ చేశారు. నెలలోపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి తీర్పు నిలుపుదల ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఆదేశిస్తు జడ్జి శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాసిక్యూషన్ నిర్వహణలో కామారెడ్డి జిల్లా పోలీస్ లైజన్ అధికారి రాజేశ్వర్ సహాయకారిగా ఉన్నారు.