27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీర్కూర్ లో దొంగల బీభత్సం…ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

 

…. 20 తులాల బంగారం,

. . . 120తులాల వెండి

. . . 1.50లక్షల నగదు చోరీ

బాన్సువాడ బతుకమ్మ :

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి సోమవారం రాత్రి నాలుగు ఇళ్లలో ఒకేసారి చోరీకి పాల్పడ్డారు.ఇంటి యజమానుల కథనం ప్రకారం, సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 120 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు.శుభకార్యాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గ్రామంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రెండు రోజుల్లో  జరిగిన భారీ చోరిలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శాంతి భధ్రతల పరిస్థితులను దోంగలు సవాల్ చేస్తున్నారు.

More articles

Latest article