27.2 C
Hyderabad

సమాచారం ఇవ్వరు.. సహచట్టంను లెక్కచేయరు

Must read

📰 Generate e-Paper Clip

  • తప్పుడు సమాచారం ఇచ్చాను.. క్షమించగలరు
  • సహ ధరఖాస్తుపై జిపి కార్యదర్శి వివరణ
  • దరఖాస్తుదారు ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకునేనా..?

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:  సమాచార హక్కు చట్టం – 2005 పై అధికారులకు ఎప్పుడు నిర్లక్ష్యమే. సహ దరఖాస్తుదారు చేసిన వినతిని కనీసం చదువకుండా సమాచారం ఇవ్వడం వారికే చెల్లుతుంది. సహ చట్టం ప్రకారం సమాచారం ఇవ్వకపోయిన, కనీసం పట్టించుకోకపోయిన, నిర్లక్ష్యం చేసిన దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చట్టాలు చెబుతున్న అవి చుట్టబండలు అవుతున్నాయి. సమచార హక్కు చట్టంకు దరాఖాస్తుచేసుకున్న వ్యక్తి నేరుగా తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంలో క్షమించగలరు.. అనే ఒక లేఖ పంపించడం గమనార్హం..

నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారం (ఎం) గ్రామంలో ఆరు అంశాలపై ఒక దరాఖాస్తుదారు సమాచార హక్కు చట్టం 2005 క్రింద 2025 ఫిబ్రవరి 11న దరఖాస్తు చేశారు. దానిపై గ్రామ పంచాయతి కార్యాదర్శి మార్చి 1న సంబంధిత సహ దరాఖాస్తుపై తప్పుడు సమాచారం ఇచ్చారు. దరాఖాస్తుదారు 6 ఆంశాలకు సంబంధించిన సమాచారం కోరితే 12 ఆంశాలకు సంబంధించిన సమాచారం జిరాక్స్ ప్రతులు ఇవ్వాడానికి రూ.14,00 చెల్లించాలని సమచారం అందించారు. దానిపై సహదరఖాస్తుదారు తాను 12 అంశాల సమాచారం కోరలేదని, కేవలం 6 అంశాల సమాచారం అడిగితే తప్పుడు సమాధానంతో సమాచారం ఇవ్వడంపై నిజామాబాద్ రూరల్ మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారికి మార్చి 19న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  విషయం తెలిసిన పంచాయతీ అధికారి తాను ఇచ్చిన ఆర్ టిఐ దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చానని అందుకు క్షమించాలని వేడుకున్నారు. కాని సంబంధిత జిపి కార్యదర్శి తప్పుడు సమాచారంపై సిసిఏ గైడ్ లైన్స్ ప్రకారం  మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆర్ టిఐ ధరఖాస్తులపై కిందిస్థాయి అధికారుల తీరుతో దరఖాస్తులు అబాసు పాలు అవుతున్నాయి. అధికారుల సమీక్ష కొరవడింది. తప్పుడు సమాచారం ఇచ్చిన, నిర్లక్ష్యం చేసిన తమపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోరు అనే ధీమా కనబడుతుంది.

ఆర్టిఐ యాక్టు పై  అధికారులకు అవగాహన కొరవడింది. దరఖాస్తు దారు అడిగిన సమాచారం ఇవ్వడానికి చెల్లించాల్సిన రూసుంపై కింది స్థాయి అధికారులలో అవగాహనలేదు అనడానికి ధర్మారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరు నిదర్శనం.. ఆర్టిఐ యాక్టు సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 ( ఏ) దరఖాస్తుదారు ఏ అంశానికి ఎన్నిపేజీలు, పేజీకి ఎంత రూసుము చెల్లించాలని చెబుతుంది. కాని సంబంధిత సెక్షన్ పై కనీస అవగాహన లేకుండా జిపి కార్యదర్శి ఆర్టిఐ యాక్టు సెక్షన్ 7 సబ్ సెక్షన్ 6 లో నిర్ధేశించిన కాలపరిమితిలో అధికార యంత్రాంగం విఫలమైనప్పుడు, తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు సబ్ సెక్షన్ 5 లో ఉన్న ఎమాటాతో నిమిత్తం లేకుండా దరఖాస్తుదారుకు పూర్తి ఉచితంగా అందించాలి. కాని ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాదర్శి 12 అంశాలపైన ఐనా, 6 ఆంశాలపైన కూడా ఒక్కటే రుసుం చెల్లించాలని సమాచారం ఇవ్వడం వారికి సహచట్టంపై అవగాహన లేదని చెబుతుంది. అదేవిధంగా తప్పుడు సమాచారం ఇచ్చానని స్వయంగా చెబుతునే మళ్లీ గతంలో కోరినట్లు రూ.1400 రూసుము చెల్లిస్తే సమాచారం ఇస్తానని రిప్లై ఇవ్వడం గమనార్హం. సంబదిత సమాచార హక్కుచట్టం దరఖాస్తుపై జరుగుతున్న తప్పిదాలపై దరఖాస్తుదారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

They don't give information.. they don't count the co-law.

More articles

Latest article