29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వారిద్దరూ రాజీకొచ్చారు

Must read

📰 Generate e-Paper Clip

ముంబయి, బతుకమ్మ: ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకుని కోర్టుకెక్కిన ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కవి, సినీ పాటల రచయిత జావెద్ అఖ్తర్ రాజీకొచ్చారు. తమ కేసులను ఉప సంహరించుకుంటున్నట్లు వారిద్దరూ న్యాయస్థానం ఎదుట తెలుపగా కోర్టు అంగీకరించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారంలో తన పరువుప్రతిష్టకు భంగం కలిగేలా కంగానా వ్యాఖ్యలు చేశారని జావెద్ అఖ్తర్ 2020లో పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా 2016లో తన సహనటుడికి క్షమాణలు చెప్పాలని జావెద్ తనను బెదిరించారని కంగనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు కేసులను వారిద్దరూ ఉప సంహరించుకొని రాజీకొచ్చారు.

More articles

Latest article