నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ నేతృత్వంలో అధికారులు శనివారం ఉదయం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్ను వసూలు చేశారు. అధిక బకాయిలు ఉన్న వ్యాపార సముదాయాలకు కమిషనర్ స్వయంగా వెళ్లారు. వాసవి డిజిటల్ నుంచి రూ.2.33లక్షలు, భవాని డెంటల్ ఆస్పత్రి నుంచి రూ.7.42లక్షలు, ప్రియాంక స్కిన్ క్లీనిక్ నుంచి రూ.12.96లక్షలు, కేర్ డిగ్రీ కళాశాల నుంచి రూ.1.91వేలు, హై టెక్ మొబైల్స నుంచి రూ.5లక్షల పన్ను బకాయిలు వసూలు చేశారు. ఒకే రోజు సుమారు రూ.29లక్షల బకాయిలను వసూలు చేశారు. అలాగే స్వగత్ హోటల్ లో తనిఖీలు నిర్వహించి ఆహారపదార్థాల నాణ్యతను పరిశీలించారు.

