- ప్రశాంత్ రెడ్డి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు
- యూరియా సరఫర విషయం మంత్రిగా పనిచేసిన నీకు అవగాహన లేదా..?
- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
మోర్తాడ్, బతుకమ్మ: యూరియా విషయంలో రైతులెవరు ఆందోళన చెందవద్దని కావలసినంత యూరియా అందుబాటులోకి వస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. యూరియా విషయంలో ప్రభుత్వాన్ని కావాలనే బదునం చేస్తున్నారని మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డికి జిల్లాలో ఎంత యూరియా అవసరమో ఇప్పటివరకు ఎంత సరాపరాయిందో కూడా కనీస అవగాహన లేదు అని అన్నారు. బిజెపి నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వమే యూరియాని సరఫరా చేస్తుందని కొన్ని అనివార్య కారణాలవల్ల యూరియా లోటు ఏర్పడిందని చెబుతున్నారని తెలియజేశారు. అవగాహన లేని బీఆర్ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి యూరియా విషయంలో ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తున్నారని ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. 2022-23 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాకు 27,782 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. 2023-2024 సంవత్సర కాలంలో నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. 2024-2025 సంవత్సరకాలంలో ఇప్పటివరకు 42,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడే ప్రశాంత్ రెడ్డి ఈ విషయాలను తెలుసుకొని మాట్లాడాలి ఇప్పటివరకు పెద్ద రైతులు ఎక్కువగా యూరియా కొని దాచి పెట్టుకోవడం వల్ల చిన్న రైతులకు యూరియా సరఫరా కాక ఇబ్బంది జరుగుతుందని రైతులు యూరియాని స్టోర్ చేసుకోకుండా అవసరమైన వారికి అందే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో 2022-23 సంవత్సరకాలంలో 7181 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది అలాగే 2023-24 సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9861 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. 2024-2025 సంవత్సర కాలంలో 11247 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు సరఫరా చేయడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నవారు ప్రజలను అయోమయానికి గురి చేయకుండా ఉంటే మంచిది అని ఆయన అన్నారు. యూరియా లోటు ఉందని ప్రచారం చేయడం వల్లే పెద్ద రైతులు యూరియాని స్టోర్ చేసుకుని చిన్న రైతులకు అందకుండా పోయిందని ఈ విషయంలో రైతులు అవగాహనతో ఉండాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో 2017 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రైతులకు ఉచిత ఎరువులు అందిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటలు కాకుండా చేతల్లో రైతులకు కేవలం 20 నెలల్లో 60 వేల కోట్ల ప్రతిఫలాలను అందించిందని ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రైతుల సంక్షేమం కొరకు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల లోపు రుణాలను ఏక మొత్తంలో మాఫీ చేసి రైతులను ఆదుకున్నదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికి ఒక ఉద్యోగం అంటూ ప్రజలను మోసం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీది అని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించిందని నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మిస్తుందని ఆయన అన్నారు. ఒక ఉద్యోగం ఇవ్వడానికి బదులు 20,30 పెన్షన్లు ఇవ్వడం ద్వారా ఓట్లను సాధించుకోవచ్చని కుటిల బుద్ధిని గత ప్రభుత్వం ప్రదర్శించిందని కానీ ప్రజా ప్రభుత్వం పేద పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు 3500 కాదు ఇంకా ఎక్కువ అవసరమైన ఓడిపోయినప్పటికీ నేనే బాధ్యత తీసుకొని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను అందిస్తానని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రావాలంటే బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించేదని ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడుపు కట్టుకొని పనిచేస్తున్నారని సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని ఆయన తెలిపారు. పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామని ఇంకా అవసరమైన వారికి అందిస్తామని తెలిపారు. ఇవన్నీ చూస్తే ప్రశాంత్ రెడ్డికి కడుపు మండుతున్నట్లు ఉన్నదని ఎనిమిది నెలలుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచకుండా అధికారులకు తెలుపకుండా ప్రోటోకాల్ ని అడ్డుపెట్టుకొని చెక్కులు పంచడం లేదని ఒకసారి చెక్కులు వాపస్ వెళ్లాయని ప్రశాంత్ రెడ్డికి పేద ప్రజలు అంటే చులకన భావం ఉందని చింత చచ్చిన పులుపు చావదు అన్నట్లు వాళ్ల ప్రభుత్వం పోయిన ప్రశాంత్ రెడ్డి అహంకారం తగ్గలేదని మేము ప్రోటోకాల్ ని గౌరవించి ఆగుతున్నామని ప్రశాంత్ రెడ్డికి ఇదే చివరి హెచ్చరిక అని ఆయన తెలిపారు. పదేళ్లు మొద్దు నిద్రపోయిన ప్రశాంత్ రెడ్డి ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు బడ్జెట్ లేని సాంక్షన్లు ఇప్పించి ప్రజలను మోసం చేశారని కొంతమంది ఈయన మోసాన్ని గ్రహించిన వారు తెలివిగా తప్పుకున్నారని కానీ చిన్న చిన్న కుల సంఘాల వారు కుల భవనాలు నిర్మించుకొని ఫండ్ లేని ప్రోసిడింగ్ లు తీసుకొని మోసపోయామని గ్రహించారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడి వారి బిల్లును ఇప్పించే ప్రయత్నం చేస్తున్నానని వారందరినీ కాపాడుకుంటామని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ప్రశాంత్ రెడ్డి మంత్రి పదవి అధికారాన్ని ఉపయోగించుకొని నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల నిధులు లేని తప్పుడు ప్రొసిడింగులు ఇచ్చి ఓట్లు దండుకున్నారని ప్రజలకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని అన్నారు నిధులు లేనట్లు ప్రశాంత్ రెడ్డికి తెలిసినా కావాలనే ప్రజలను మోసం చేశారని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపిస్తుందని అట్లాంటి ప్రభుత్వం మీద తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ అద్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.