28.8 C
Hyderabad
Monday, August 3, 2026

వారు విద్యావేత్తలు కాదు.. విద్యావ్యాపారులు

Must read

📰 Generate e-Paper Clip

. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్

నిజామాబాద్, బతుకమ్మ:  విద్యావంతులమని చెప్పుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న వారు విద్యా వేత్తలు కాదని.. వారు విద్యా వ్యాపారులని ఇండిపెండెంట్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ విమర్శించారు. నిజామాబాద్  లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను విద్యార్థి దశ నుంచే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఉద్యమకారుడి గా కేసులకు బెదరకుండా పోరాడానని, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ గా అనేక పథకాలకు శ్రీకరం చుట్టనని పేర్కొన్నారు.  దేశంలోనే ఎక్కడలేని విధంగా కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియల (అంతిమ యాత్ర )పథకానికి శ్రీకారం చుట్టనని తెలిపారు. ప్రజా సేవ కోసమే తన జీవితాన్ని దారపోసానని అన్నారు. ప్రస్తుత అభ్యర్థులు ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఎన్నికల్లో పోటీ చేసే అవసరం ఏముంది? ఇన్నేళ్లుగా అభ్యర్థులకు ప్రజాసేవ గుర్తులేదా అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరగట్లేదని  తనపై కుట్రలు చేస్తున్నారని నామినేషన్ సమయంలో కూడా తమ వాహనాలను అడ్డగించి మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించడం ఎన్నికల నిబంధనలు పాటించని వారిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేవలం తన పేరు సీరియల్ నెంబర్ లో ముందు  వరుసలో రావాలని కుట్రలు చేసి నరేందర్ రెడ్డి పేరును అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మార్పులు చేసి అన్యాయం చేశారని అన్నారు. కరోనా సమయంలో ఏ ఒక్క నాయకుడైనా మీకు సహాయం చేశారా? ఇప్పుడే మీకు గుర్తుకు వచ్చారా అని అన్నారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉండే నేతలకు మండలిలో అవకాశం ఇస్తే ప్రశ్నించే గొంతుకనై గళమెత్తి పట్టభద్రుల హక్కుల కోసం పోరాడుతానని భరోసా ఇచ్చారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది తేజ్ దీప్ రెడ్డి కోమటిరెడ్డి , ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు గౌడ్, ఆమ్ ఆద్మీ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు అజహరుద్దీన్, జన్ ఉద్యం కాన్సుమర్ వెల్ఫేర్ కౌన్సిల్ జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్, ఉద్యమకారుడు రాము యాదవ్ సూర తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article