వారు విద్యావేత్తలు కాదు.. విద్యావ్యాపారులు

. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ నిజామాబాద్, బతుకమ్మ:  విద్యావంతులమని చెప్పుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న వారు విద్యా వేత్తలు కాదని.. వారు విద్యా వ్యాపారులని ఇండిపెండెంట్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ విమర్శించారు. నిజామాబాద్  లోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను విద్యార్థి దశ నుంచే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఉద్యమకారుడి గా కేసులకు బెదరకుండా పోరాడానని, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ గా అనేక పథకాలకు శ్రీకరం చుట్టనని...